Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ కుమ్మ‌క్కు రాజ‌కీయాల‌కు ఇదే నిద‌ర్శ‌నం.. బీఆర్ఎస్ ట్వీట్!

BRS Fire on Congress and BJP Through X
Advertisement
  • తెలంగాణలో కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం ఈ ఢిల్లీ అక్రమ కేసుల‌న్న బీఆర్ఎస్ 
  • అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అయిన‌ప్పుడు.. క‌విత అరెస్టుపై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడ‌ద‌న్న గులాబీ పార్టీ  
  • కేజ్రీవాల్ అరెస్టుకు నిర‌స‌న‌గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ సంఘీభావం తెల‌ప‌డంపై బీఆర్ఎస్ ధ్వ‌జం
Advertisement
రాష్ట్రంలోని కాంగ్రెస్‌-బీజేపీ తీరుపై బీఆర్ఎస్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిర‌స‌న‌గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ సంఘీభావం తెలియ‌జేయ‌డం పట్ల బీఆర్ఎస్ పార్టీ 'ఎక్స్' (ట్విట‌ర్) వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తింది. 

తెలంగాణ‌లో కాంగ్రెస్‌-బీజేపీ కుమ్మ‌క్కు రాజ‌కీయాల‌కు ఈ ఢిల్లీ కేసులు నిద‌ర్శ‌నం అని, కేజ్రీవాల్ అరెస్టు అక్ర‌మం అని కాంగ్రెస్ నేత‌లే తేల్చి చెబుతున్నార‌ని పేర్కొంది. మ‌రి అదే కేసులో అరెస్ట‌యిన క‌విత గురించి కాంగ్రెస్ నేత‌లు ఒక్క‌మాట కూడా మాట్ల‌డ‌ట్లేద‌ని మండిప‌డింది. ఈ కాంగ్రెస్-బీజేపీ నీచ రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం అంటూ నిరాహార దీక్ష శిబిరంలో బ‌ల్మూరి వెంక‌ట్ మాట్లాడుతున్న పేప‌ర్ క్లిప్పింగ్‌ను త‌న ట్వీట్‌కు బీఆర్ఎస్ జ‌త చేసింది.  
Advertisement
Advertisement
BRS
Congress
BJP
Telangana
Twitter

More Telugu News